Ravva rasagulla..........
రవ్వ రసగుల్లాలు
కావలసినవి:- బొంబాయి రవ్వ - రెండు కప్పులు,
- పాలు - మూడు కప్పులు,
- పంచదార - ఒకటిన్నర కప్పు,
- నూనె - సరిపడా. ravaa rasgulla
తయారు చేయు విధానం:
ముందుగా ఒక పాత్రలో పాలు పోసి మరిగించుకోవాలి. తరువాత అందులో బొంబాయి రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండల మాదిరిగా చేసుకోవాలి. తరువాత వీటిని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మరొక పాత్రలో నీళ్లుపోసి తగినంత పంచదార వేసి పాకం పట్టాలి. నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న ఉండలను ఈ పాకంలో వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి తీసుకోవాలి.
0 comments:
Post a Comment